BHAGAVATA KADHA-3    Chapters   

(3)

దేవేంద్రుని అర్థసింహాసనము అభించుట

ఛప్పయ

దేఖి దేవపతి ముదిత మన, పుత్రప్రేమ పరగట కియో |

సిర సూఁధ్యోఁ ముఁహచూమికేఁకేఁ, అధోసింహాసనదియో ||

అర్థము

నన్ను సంతోషమనస్కుఁడై పుత్ర ప్రేమను బ్రకటించుచు దేవేంద్రుఁడు చూచెను. శిరస్సు మూర్కొని, ముద్దు పెట్టుకొని అర్థసింహాసనమునఁ గూర్చుండఁబెట్టుకొనెను.

దూరమునుండి నారాకఁజూడఁగానే దేదేంద్రుని ముఖ కమలము వికిసించెను. నేను త్వరత్వరగాఁ బోయి ఆతని పరమ పావన చరణములపై నతాశిరస్సునుంచి మ్రొక్కితిని. ఏచరణములను నిత్యము అసంఖ్యాకమలులగు ముకుట మణికాంతులచే దేవతలు, రాజర్షులు శోభాయమానము కావించెదరో త్రైలోక్యవందితములగు నాచరణములను నేను బట్టుకొని నా మస్తకమునకు రాచుకొని, ఆనందాశ్రువులచే వానిని గడిగితిని. దేవేంద్రుఁడత్యంతప్రీతితో తన దీర్ఘ బాహువులతో నన్ను బలపూర్వకముగ లేవఁదీసి కౌఁగిలించుకొనెను. ఆతఁడు నా శిరస్సును మూర్కొని, తన కోమలకరములతో నాముఖమును దుడిచెను. వెండ్రుకలు సరిచేసి, ఎత్తుకొని తన అర్థాసనమునఁ గూర్చుండఁబెట్టుకొనెను. సితాపుత్రులు మిరువుర మొక్క యాననమునఁ గూర్చుండుటను గాంచి, స్వర్గములోని సమస్త దేవతలు, ఋషులు, గంధర్వులు, రాజర్షులు, దేవర్షులు మిక్కిలి సంతసించిరి. అందఱును తదేక దృష్టితో మమ్ముల నిద్దరను జూచుచుండిరి. నా యీ సౌభాగ్యమునకు నేను చాల గర్వించితిని. మానవశరీరముతో దేవేంద్రుని అర్థసింహాసనమునఁ గూర్చుండుటకు నేను చాల లజ్జించితిని. సిగ్గుచే నేను తలయెత్తి అందఱను జూడనైనఁజూడలేదు. సిగ్గుతో నింద్రుని వడిలోఁగూర్చుంటిని. అనుపమ రూపలావణ్య యుక్తలగు స్వర్గములోని దేవాంగనలు నాకు చామరముల వీఁచుచుండిరి. ఆకాశములో వేలకొలఁది మెఱుపు లొక్కసారిగా మెఱసినట్లు వేలకొలఁది అప్సరసలా యింద్రసభలో నుండిరి.

దేవేంద్రుని యాజ్ఞచే అప్సరసలు, గంధర్వులు నాపాదములను గడిగి విధ్యుక్తముగఁ బూజించిరి. స్వర్గములో అమానవీయ సత్కారములను బొందుటచే నా యానందమునకు మేఱలేకుండెను. నేను మిమ్ములను మఱవలేదు. నేను సన్మానింపఁదగిన వాఁడను బొత్తుగాఁ గానని నాకు బాగుఁగాఁ దేలియును. ఇది యంతయు నావ్యామసుందరుని కృపాఫలమే. ఆతఁడు నన్ను గాడిదమీఁదనుండి యెత్తి ఐరావతముపైఁ గూర్చుండఁబెట్టఁగలఁడు. ఆతఁడే తృణమును మేరువును జేయఁగలఁడు. ఆతని కృపయుండినచో స్వర్గలోకమేయేల, బ్రహ్మలోకమే తుచ్ఛముగఁ దోఁచును. సర్వలోక పితామహుఁడగు బ్రహ్మకూడ ఆతని కృపకై దేవురులాడుచుండును.

రాజా! ఏవఁడు మానవులమగు మనలనుదేవతలఁ గావించెనో, నిర్భలులను బలవంతులజేసెనో, రాజ్యభ్రష్టులమై నప్పటికిని చక్రవర్తుల నొనర్చెనో, అసహాయులమైనప్పటికిని సర్వ విధముల సహాయమొనర్చెనో, అన్నయగుబలరాముఁడు కాదను చున్నను గౌరవులను వీడి మనపక్షమునే వహించెనో, నిఃశస్త్రుఁడయ్యును నన్ను నిమిత్తముగాఁ బెట్టుకొని సర్వశత్రు సంహార మొనర్చెనో, అట్టివాఁడు మనలను నడిసముద్రములో వదలి మాయమయ్యెను. ప్రభూ! ఆతఁడీ ప్రపంచమున నుండరాదు. దేవతల వలనగూఁడ చావని నివాతకవచులను నేను స్వర్గములోఁ జంపితిని. ఎవ్వనిబలమున వారికి జంపుటచే నాకీ వర్త్యలోకము లోను,స్వర్గములోను కీర్తి ప్రశంసలులభించినవో, అట్టి శ్రీకృష్ణుఁడు లేకపోవుటచే నన్నాటవికు లోడించిరి. కావున రాజా! మరమును శీఘ్రతిశీఘ్రముగ ఆతని మార్గము ననుసరింపవలెను.

ఇట్లని యర్జునుఁడు మూర్ఛిల్లెను-

ఛప్పయ

కరత తపస్యా భీల వేష ధరి శివ తహఁ ఆయే |

జాని జంగలీ జాతి, లడ్యో హర అతి హర్షాయే ||

భయో యుద్ధ ఘనఘోర, భఈ నహిఁ కుంఠితమోమతి |

కృష్ణ కృపా తేఁ ఉమా సహిత, శితుష్టభ##యే అతి ||

జనకీకృపా ప్రసాద తేఁ, నర తను తేఁసుర పుర గయో |

అర్థ సింహాసన హరి దయో, అబ ఉన బిను నిర బల భయో ||

అర్థము

అర్జునుఁడు ధర్మరాజుతో నిట్లనెను:- తపస్సు చేయఁగా శివుఁడు భిల్లవేషమున నచ్చటికి రాఁగా, నిజముగా నాతఁడాట వికుఁడని పోరాడితిని. దానికి శంకరుఁడు సంతసించెను. యుద్ధము ఘోరముగ జరిగెను. నామనస్సు వెనుకాడలేదు. కృష్ణ కృపవలన ఉమామహేశ్వరులు సంతుష్టిచెందిరి.

ఏమహామహుని కృపచే నే నీ మానవ శరీరముతోడనే స్వర్గమునకు వెళ్లితినో, అచ్చట ఇంద్రుఁడర్థసింహాసనమీయఁగాఁ గూర్చుంటినో, ఆప్రభువు పోఁగా నిప్పుడునేను నిర్బలుఁడనైతిని.

BHAGAVATA KADHA-3    Chapters